Widgets Magazine

ముద్దుముద్దుగా డబ్బింగ్ చెప్పి 'సమ్మోహన' పరిచిన అదితి రావు

శుక్రవారం, 8 జూన్ 2018 (16:47 IST)

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు భామల కంటే పరాయి రాష్ట్రాల భామలే అధికంగా ఉన్నారు. వీరిలో కాజల్, తమన్నా వంటి వారు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో ఉంటున్నా ఎన్నడూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న పాపానపోలేదు.
aditi rao
 
కానీ, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌, స‌మంత‌, కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్‌, షాలిని పాండే త‌దిత‌రులు రీసెంట్ చిత్రాల‌లో వారి పాత్ర‌ల‌కి వారే డ‌బ్బింగ్ చెప్పుకుని ఇతర హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 
 
తాజాగా వీరి సరసన అదితి రావు కూడా చేరిపోయారు. డైరెక్టర్ ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ తెర‌కెక్కిస్తున్న "స‌మ్మోహ‌నం" సినిమా కోసం అదితి రావు హైద‌రి డ‌బ్బింగ్ చెప్పుకుంది. ముద్దుగా ముద్దుగా తెలుగు మాట్లాడుతూ అల‌రిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోని చిత్ర యూనిట్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేసింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. 
 
సుధీర్ బాబు.. అదితి రావు ప్ర‌ధాన పాత్ర‌ల‌్లో నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల‌ 10న ఫిలిం న‌గ‌ర్ జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ హాల్‌లో ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మ‌హేష్ బాబు హాజ‌రు కానున్నారు. 'చెలియా' అనే డ‌బ్బింగ్ చిత్రంతో ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కి పరిచయమైన అదితి రావు హైద‌రి ఇపుడు "స‌మ్మోహ‌నం" చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కానుంది.

 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'పులస చేపలా ఎగిరెగిరి పడుతున్నావ్.. నీ అన్నయ్య వాటికి బ్రాండ్ అంబాసిడర్' .. శ్రీరెడ్డి

హీరో నానిని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ల వర్షం కురిపించిన నటి శ్రీరెడ్డి ఇపుడు మరోమారు మెగా ...

news

నానితో నాది కామం స్టోరీ... విడుదల చేస్తా... పెద్ద బొట్టు పెట్టుకుని శ్రీరెడ్డి మరీ...

శ్రీరెడ్డి రోజురోజుకీ తన ఫేస్ బుక్ పేజీ లైవ్‌లో హీరో నాని గురించి ఆరోపణలు చేస్తోంది. ...

news

'ఓకే నేను ఈ చిన్నోడిని కిడ్నాప్‌ చేస్తా'నంటున్న సమంత

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "రంగస్థలం". సమంత హీరోయిన్. ఈ చిత్రం ...

news

క్యాష్ సెట్‌లో సుమకు ప్రమాదం... పెద్ద దెబ్బే...

ఈటీవీలో ప్రసారమవుతున్న పాపులర్ టీవీ షోలలో క్యాష్ కార్యక్రమం ఒకటి. దీనికి ప్రజాదరణ మరియు ...

Widgets Magazine