శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (16:03 IST)

బిగ్ బాస్ ఫైనల్ అయిపోగానే కాశీకి వెళ్తానంటున్న నాని... ఏమైంది?

హీరో నాని దేవదాస్ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.... నా లైఫ్‌లో మోస్ట్ హెక్టిక్ వీకెండ్ ఇది. మోస్ట్ స్ట్రెస్‌ఫుల్ వీక్. ఎక్సైటింగ్ వీక్ కూడా ఇదే. బిగ్ బాస్ ఫైన‌ల్ కూడా ఇదే వారం ఉండ‌టంతో ఒత్తిడి ఉంది. ప్ల‌స్ మైన‌స్ రెండూ ఉన్నాయి. ఈ వారం అయిపోత

హీరో నాని దేవదాస్ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.... నా లైఫ్‌లో మోస్ట్ హెక్టిక్ వీకెండ్ ఇది. మోస్ట్ స్ట్రెస్‌ఫుల్ వీక్. ఎక్సైటింగ్ వీక్ కూడా ఇదే. బిగ్ బాస్ ఫైన‌ల్ కూడా ఇదే వారం ఉండ‌టంతో ఒత్తిడి ఉంది. ప్ల‌స్ మైన‌స్ రెండూ ఉన్నాయి. ఈ వారం అయిపోతే కొన్ని రోజులు కాశీకో లేదంటే ఎక్కడికో ఓ మంచి ప్రదేశానికి అలా వెళ్లిపోతాను. 
 
ఇక దేవదాస్ విషయానికి వస్తే దాస్ చాలా ఇన్నోసెంట్. సాఫీగా సాగుతున్న లైఫ్ లోకి ఊహించ‌కుండా ఎవ‌రూ లైఫ్‌లో చూడ‌ని ఓ వ్య‌క్తి ఫ్రెండ్‌గా వ‌స్తే వాడి లైఫ్ ఎలా మారిపోతుంది అనేది కారెక్ట‌ర్. నిజాన్ని నిజంగానే ఈ సినిమాలో చూపించాం. ఫోన్ విష‌యంలో కూడా ఎప్పుడూ తాను చేతిలో ప‌ట్టుకునే ఉంటాన‌ని నాగ్ స‌ర్ వీడియో చేసారు. 
 
అయితే నాగార్జున గారు ప‌క్క‌నే ఉన్న‌పుడు అలాంటి ధైర్యం చేయ‌లేదు కానీ వీడియో చేసేస‌రికి అది వైర‌ల్ అయిపోయింది. నాగార్జున గారితో స్క్రీన్ స్పేస్ చేసుకోవ‌డ‌మే అదృష్టం. ఆయ‌న సినిమాల కోసం టికెట్ల కోసం కొట్టుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయ‌న‌తో న‌టించ‌డం అనేది నా అదృష్టం. న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ఓపెన్‌గా చెప్పేస్తారు. సినిమా అయిపోయిన త‌ర్వాత ఆయ‌న నా గురించి చెప్పిన మాట‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను. మా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది అని అన్నారు.