Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

44వ ఏట అడుగుపెట్టిన ఐశ్వర్యారాయ్: అమీర్, కమల్, ప్రభాస్ ఏమంటున్నారో తెలుసా?

బుధవారం, 1 నవంబరు 2017 (11:30 IST)

Widgets Magazine

అందాల రాశి ఐశ్వర్యారాయ్ 44ఏట అడుగుపెట్టింది. తన కెరీర్‌లో పెళ్లికి ముందే కాకుండా పెళ్లికి తర్వాత కూడా హీరోయిన్‌గా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ఐశ్వర్యా రాయ్ నవంబర్ 1న పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోంది. బాలీవుడ్ నటీమణిగా ముద్రవేసుకున్న ఈ భామ దక్షిణాది సినిమాల్లో అదరగొట్టింది. నాలుగు పదుల వయస్సైనా హీరోయిన్‌గా అందాలను ఆరబోస్తూ సినిమాలు చేసేస్తుంది.
 
1994లో విశ్వ సుందరిగా నిలిచిన ఐశ్వర్యారాయ్... ఆపై ఫ్యాషన్, మోడలింగ్ చేస్తూ సినీతార ఎదిగింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్ళాడిన ఈ మాజీ విశ్వ సుందరికి ఆరాధ్య అనే అమ్మాయి వున్న సంగతి తెలిసిందే. 
 
తన కెరీర్‌లో తాళ్, ఇద్దరు, జీన్స్ వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన ఐష్.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో హమ్ దిల్ దె చుకె సనమ్ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ బెస్ట్ అవార్డును గెలుచుకుంది. ఆపై మేళ, ధూమ్-2, దేవదాస్, జోష్, గుజారిష్, జోధా అక్బర్ వంటి వంటి సినిమాలు మంచి గుర్తింపును సంపాదించిపెట్టాయి. దేశ, అంతర్జాతీయ నటులతో నటించిన ఐశ్వర్యతో అమీర్ ఖాన్, కమల్ హాసన్, బాహుబలి హీరో ప్రభాస్ కలిసి నటించాలని ఉబలాటపడుతున్నారు. 
 
ఇప్పటికే  రెండో ఇన్నింగ్స్‌లో సినీ ఛాన్సులతో బిజీగా వున్న ఐశ్వర్యారాయ్‌తో గతంలో సినిమా చేసే అవకాశాలను కోల్పోయామని.. ఇక అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం వదిలిపెట్టబోమని కమల్, అమీర్ అంటున్నారు. ఇక బాహుబలితో అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగిపోయిన ప్రభాస్ కూడా అందాల రాశి ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదని అంటున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అమలా పాల్‌కు కొత్త చిక్కు... బెన్స్ కారు కొని.. పన్ను చెల్లించకుండా?

సినీ నటి అమలా పాల్ కొత్త చిక్కులో పడింది. కారు నకిలీ రిజిస్టేషన్ వ్యవహారంతో ఆమె ఇబ్బందిలో ...

news

ఆ ముసలోడు నాకు నచ్చాడు.. మీకేంటి బాధ : అర్షి ఖాన్

బాలీవుడ్ హాటెస్ట్ నటీమణుల్లో అర్షి ఖాన్ ఒకరు. ఈమె చెబితే ప్రతి ఒక్కరూ హడలిపోతున్నారు. ...

news

జీవిత నాకిస్తున్న బహుమతి ఇది.. చిరంజీవి మెచ్చుకున్నారు : రాజశేఖర్

సీనియర్‌ కథానాయకుడు రాజశేఖర్‌ నటించిన చిత్రం ‘పీఎస్‌వీ గరుడవేగ 126.18ఎం’. ప్రవీణ్‌ ...

news

మలయాళ సినిమాలో మియా ఖలీఫా.. సన్నీ లియోన్‌కు పోటీగా..?

ప్రముఖ పోర్న్ స్టార్, పోర్న్ మోడల్ మియా ఖలీఫా మలయాళ సినిమా ద్వారా భారత ప్రేక్షకుల ముందుకు ...

Widgets Magazine