ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (14:25 IST)

అఖండ 2 తొలి డైలాగ్ - నేలను తాకితే జరిగేది అఖండ తాండవం అన్న బాలక్రిష్ణ

Balayya first dailouge
Balayya first dailouge
Balayya first dailouge
నందమూరి బాలకృష్ణ తాజా సినిమా అఖండ 2 నేడు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అఖండలో నటించిన ప్రజ్నా జైస్వాల్ నాయికగా నటిస్తోంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో అఖండంగా ప్రారంభమైన ఈ వేడుకకు సినీరంగ ప్రముఖులు, బాలయ్య అభిమానులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు. అంబికాక్రిష్న తోపాటు సినిమా నిర్మాణసంస్థలకు చెందిన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. రామానాయుడు స్టూడియోలోని విఘ్నేశ్వర ఆలయంలో పూజ నిర్వహించారు.
 
Balakrishna, Prajna Jaiswal, Tejvasini Nandamuri
Balakrishna, Prajna Jaiswal, Tejvasini Nandamuri
ముహూర్తపు షాట్ కు బాలక్రిష్ణ, ప్రజ్నా జైస్వాల్ పై బాలక్రిష్ణ ద్వితీయ కుమార్తె తేజ్వసిని క్లాప్ కొట్టారు. అనంతరం దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన డైలాగ్ ను. ఆయన చెబుతూ... పంచభూతాల పేరుతో మీరు తాకితే నేల అశురురడికాదురా.. ఈశ్వరుడిది  పరమేశ్వరుడిది దాన్ని తాకితే జరిగేది తాండవం అఖండ తాండవం.. అంటూ  తొలి డైలాగ్ ఆవేశంగా చెప్పారు. దాంతో అక్కడివారంతా జైబాలయ్య అంటూ. నినాదాలు చేస్తూ ప్రశంసలు కురిపించారు.
 
ఇప్పటికే బాలక్రిష్ణ తన 109 చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నది తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా తన నెక్స్ట్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. మాస్ చిత్రాల దర్శుకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య తన కొత్త సినిమాను ప్రారంభించాడు. బాలీవుడ్ నటి నాయికగా నటిస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.