బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (17:02 IST)

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'అఖండ' కొత్త పోస్టర్

Akhanda, New look
'సింహా', 'లెజెండ్' వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయాల త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్నహ్యాట్రిక్ మూవీ 'అఖండ‌'. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యువ నిర్మాత  మిర్యాల రవీందర్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
గురువారం (జూన్ 10న) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం 04:36 గంటలకు కొత్త పోస్టర్ విడుదల చేశారు. దీనికి ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నందమూరి అభిమానుల్లో పోస్టర్ విడుదలతో ముందుగా పుట్టినరోజు సంబరాలు మొదలయ్యాయి. ఆల్రెడీ టైటిల్ రోర్ పేరుతో విడుదలైన 'అఖండ' టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కేవ‌లం 16రోజుల్లోనే 50మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియ‌న్స్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
 
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ "మా హీరో నందమూరి బాలకృష్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అభిమానులకు పుట్టినరోజు కానుకగా పోస్టర్ విడుదల చేశాం. 'అఖండ' టైటిల్ రోర్‌తో ప్రేక్ష‌కుల‌లో, అభిమానుల్లో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. వాటిని అందుకునేలా బోయపాటి శ్రీను గారు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. కొంతే బ్యాలన్స్ ఉంది. అతి త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం. షూటింగ్ కంప్లీట్ అయ్యాక విడుదల తేదీ ప్రకటిస్తాం. శుభముహూర్తాన సినిమాను ప్రేక్షకదేవుళ్ళ ముందుకు తీసుకొస్తాం" అని అన్నారు. 
 
నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌తో  పాటు భారీ తారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి  నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: త‌మన్‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: స్ట‌న్ శివ, రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.