సోనాలి బింద్రే కన్నీరు పెట్టించింది!
నటి సోనాలి బింద్రే ఇటీవలే తన సోషల్‌మీడియాలో పెట్టిన ఫొటోకు అభిమానులకు జాలేసింది. చాలామందికి కన్నీరు పెట్టినంతగా ఫీలయి ఆమెకు మనో ధైర్యాన్ని ఇచ్చారు. సోనాలికి 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంది. ఆమె భర్త గోల్డీ బెహ్ల్, కుమారుడు రణవీర్ బహ్ల్ నైతికంగా మద్దతిచ్చారు. ఇప్పుడు కోలుకుంది కూడా. కానీ గత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకుంటూ ఇటీవలే పోస్ట్ చేసింది. ఆ ఫొటోను చూసి చాలామందికి జాలేసింది.
అంతేకాదు. అమెరికాలో దిగిన ఫొటోను పెట్టడమేకాకుండా ఆమె మాటలు కూడా జీవిత లోతుల్ని చూసినట్లుగా వున్నాయి. కాలం ఎంతగా మారిపోతుంది. ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ సమయంలో ఎంత వీక్‌గా వున్నానో అర్థమయింది. శ్రీపదం తర్వాత నా జీవితం ఎలా వుందో చూశాను. ఎవరి జీవితాలను వారే ఎంపిక చేసుకోవాలి. అలాగే మీ జీవితం కూడా అంటూ అప్పట్లో నాకు కేన్సర్ వచ్చినప్పుడు అందరూ నేను కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ తెలియజేస్తుంది.