గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (11:09 IST)

సినిమా కోసం అలా తీసుకున్నాం.. ఆ ఫోటోల్లో తప్పేముంది..? అక్షర హాసన్

సినీ లెజెండ్ కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలతో అక్షర హాసన్ తీవ్ర మనస్తాపం చెందిందని వార్తలొచ్చాయి. బికినీ వేసుకొని తీసుకున్న సెల్ఫీ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై అక్షర హాసన్ వెంటనే స్పందించలేదు. తాజాగా ఈ ఫోటోల లీక్‌పై అక్షర హాసన్ స్పందించింది. 
 
తన ఫోటోలు లీక్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ సినిమా ఫోటో షూట్ సందర్భంగా తీసుకున్న స్టిల్స్ అవంటూ కామెంట్ చేసింది. కావాలని తీసుకున్న ఫోటోలు కాదు. అయినా ఆ స్టిల్స్‌లో తప్పేముంది. మరోసారి అలాంటి ఫోటోలు తీసుకోవడానికి కూడా తాను వెనుకాడనని.. అయినా ఈ ఫోటోలు లీక్ కావడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అక్షర హాసన్ స్పష్టం చేసింది.
 
ఫోటో షూట్ టైమ్‌లో తీసిన స్టిల్స్‌లో కొన్నింటిని మాత్రమే వాడుకోవాలని, మిగిలిన స్టిల్స్‌ని తొలగించాలని కానీ అలా చేయకుండా ఇలా ఇంటర్నెట్‌లో పెట్టడం సబబు కాదని వెల్లడించింది. తన అనుమతి లేకుండా తన ఫోటోలను నెట్లో పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అక్షర హాసన్ వెల్లడించింది.