Widgets Magazine

ఛాన్సిస్తామనీ టీవీ నటిని వ్యభిచారం రొంపిలోకి దించారు...

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (08:43 IST)

prostitution

సినీ మోజులో పడి అనేక మంది అమ్మాయిలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా, మధ్యవర్తులను నమ్మి మోసపోవడమే కాకుండా, చివరకు తన శీలాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. తాజా, ఓ వ్యక్తి బుల్లితెర నటిని వ్యభిచార రొంపిలోకి దించాడు. వెండితెరపై అవకాశం కల్పిస్తామని చెప్పి మోసం చేశాడు. ఫలితంగా సెక్స్ రాకెట్‌లో కూరుకునిపోయింది. ముంబైలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబై నగరంలోని మలాద్ ప్రాంతంలో ఓ టీవీ నటితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులకు వ్యభిచారం కేంద్రం నుంచి ఆ నటిని కాపాడారు. అలాగే, ఆమెను వ్యభిచారంలోకి దించిన మధ్యవర్తి ఆసిఫ్ దొరాజీవాలా, విటుడు జె.రాథోడ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఆసిఫ్ దొరాజీవాలాకు ముంబై నగరంలో చిత్ర నిర్మాణ సంస్థ ఉందనీ, ఆ సంస్థ ద్వారా సినిమాలా నటించే అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ నటిని లోబరుచుకుని, బలవంతంగా సెక్స్‌రాకెట్‌లో దించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. విటులు వాట్సాప్ ద్వారా ఈ సెక్స్‌రాకెట్‌ను సంప్రదిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. టీవీ నటిని మహిళా సదనానికి తరలించి, నిందితులను రిమాండుకు తరలించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మూడు నగరాల్లో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాలు... యనమల

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాల(ఎఫ్ఈసీ-ఫ్యామిలీ ఎంటర్ ...

news

ఏపీ సచివాలయంలో జర్మనీ స్మార్ట్ సైకిళ్లు, బైకులు

అమరావతి: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో కూడా స్మార్ట్ బైకులు ప్రవేశపెట్టాలని ఆలిండియా ...

news

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం: సూపర్ బ్లూ బడ్ మూన్‌గా చంద్రుడు(Video)

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల వెంకన్న ఆలయంతో పాటు అన్నీ ...

news

తెలుగు తమ్ముళ్ళే పెద్ద ఇసుక మాఫియాదారులు - రోజా ధ్వజం(Video)

టిడిపి నాయకులే ఇసుక మాఫియాకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు వైసిపి ...

Widgets Magazine