'అల్లాద్దీన్' ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
ఇటీవలే డిస్నీ సంస్థ మర్వెల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన "అవెంజర్స్ ఎండ్‌గేమ్". ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టించింది. అభిమానులు అవెంజర్స్ మ్యానియా నుంచి బయటకి రాకుండానే డిస్నీ సంస్థ "అల్లాద్దీన్" వంటి మరో అద్భుతమైన సినిమాను ఈ నెల 24న దాదాపు 350 థియేటర్స్‌లో విడుదల చేశారు.
ఈ చిత్రం భారత్‌లో భారీగా రిలీజ్ అవ్వడంతో పాటు తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో కూడా విడుదల అవుతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ అల్లాద్దీన్ తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాలో జీని (దెయ్యం) పాత్రకు వెంకటేష్ గొంతు అరువివ్వడం విశేషం. అలాగే అల్లాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు.
ఇటీవలే దీనికి సంబంధించిన తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు. వెంకీ, వరుణ్ తేజ్ నటించిన "ఎఫ్ 2" సినిమా సంచలనం సృష్టించడంతో వీరిద్దరితో డబ్బింగ్ చెప్పిస్తే.. సినిమా ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతో డబ్బింగ్ చెప్పించారట.
ఈ సినిమాలో జీనీగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించాడు. ఇక అల్లాద్దీన్‌గా మేనా మసూద్ యాక్ట్ చేసాడు. మొత్తంగా వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ‘అల్లాద్దీన్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పించడంతో మంచి క్రేజ్ వచ్చింది. మరి..సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.