Widgets Magazine

మీరు చాలా డేంజరండి.. అలీగారూ.. సమంత

ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (14:18 IST)

ప్రముఖ హాస్యనటుడు అలీ హాస్యం పండించడంతో పాటు వివాదాలను కూడా అప్పుడప్పుడు కొనితెచ్చుకుంటాడు. గతంలో ఇలాంటి వివాదాల జోలికెళ్లి అలీ.. నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈసారి అలీకి అటువంటి మరో పరిస్థితి ఎదురైంది. అలీ ఈసారి టాలీవుడ్ అందాల రాశి సమంతను అడిగిన ప్రశ్నకు ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
 
తాజాగా తను నటించిన ''యూటర్న్'' సినిమా ప్రమోషన్స్ కోసం అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఓ షోకి హాజరైంది. సోమవారం ఈ షో టెలికాస్ట్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అలీ తన చిలిపి ప్రశ్నలతో సమంతను కట్టిపారేశాడు. అయితే అలీ అడిగిన ప్రశ్నలపై సామ్ ఫ్యాన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో చైతూని ఏమని పిలుస్తారని సమంతను అలీ ప్రశ్నించాడు. అందుకు సమంత సిగ్గుపడుతూ బేబీ అని సమాధానం ఇచ్చింది. ఈ ప్రశ్నకు సమంత పెద్దగా ఇబ్బంది పడలేదు. 
 
మరో సంధర్భంలో 'అత్తారింటికి దారేది' సినిమాలో కామెడీ ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ స్వామీ నదికి పోలేదా..? మాటను ప్రస్తావిస్తూ మరి నాగ చైతన్య నదికి పోలేదా..? అని ప్రశ్నించాడు అలీ. దానికి సమంతా.. చైతు నదికి వెళ్లడని తన వద్దే ఉంటాడని చెప్పింది. ఆపై మీ పిల్లలు ఎలా వున్నారు.. అని అలీ అడిగిన ప్రశ్నకు సమంత ఇబ్బంది పడింది. మనం సినిమా సమయంలో మనం డిస్కస్ చేసుకున్నాం అని అలీ ఏదో చెప్తుంటే.. సమంత మాత్రం.. అలీగారూ మీరు చాలా డేంజరండి అంటూ కామెంట్ చేసింది.
 
ప్రస్తుతం అలీ అడిగిన ప్రశ్నపై సమంత అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగాలో కూడా తెలియదా అంటూ అతడిని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

టఫ్‌గా కనిపిస్తారు కానీ, మాట వింటారు. పర్వాలేదు...?

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత- వీర ...

news

బిత్తిరి సత్తి హీరోగా ‘తుపాకీ రాముడు’

పాపులర్ యాంకర్, నటుడు బిత్తిరిసత్తి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘తుపాకీ రాముడు’. ...

news

సైమా వేడుకలు.. బాహుబలికి అత్యధిక అవార్డులు..

ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక ...

news

సమంత, తమన్నా బాటలో పాయల్.. ఐటమ్‌ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్

ఆర్ఎక్స్ 100 హీరోయిన్.. పాయల్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. అయితే కథకు గల ప్రాధాన్యతను ...

Widgets Magazine