గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వసుంధర
Last Modified: గురువారం, 30 సెప్టెంబరు 2021 (21:31 IST)

సీఎం జగన్‌కు విన్నపం: రాజు తలచుకుంటే వరాలకు కొదవా? అల్లు అరవింద్ సామెతను మార్చారే?

ఇపుడు ప్రి-రిలీజ్ వేడుకలు కాస్తా సినిమా గురించే కాకుండా ప్రభుత్వాలకు విన్నపాలను విమర్శలు చేసే వేదికలుగా మారుతున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల విషయంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు.
 
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రెయిలర్ విడుదల సందర్భంగా అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? అన్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తున్నట్లు తెలిపారు. ఐతే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే సామెతను నిర్మాత అరవింద్ గారు ఇలా మార్చి చెప్పడం కాస్త ఆసక్తికరంగా మారింది.