1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (13:59 IST)

ఆ క్షణమే సినిమాలను వదిలేయాలనుకున్నా.. అమలాపాల్

Amala Paul
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలాపాల్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 
 
ఆ సమయంలోనే ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాననే విషయం అర్థం కాలేదు. ఆ క్షణమే సినిమాలను వదిలేయాలి అనుకునేంత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను అని తెలిపింది అమలాపాల్. 
 
"అటువంటి సమయంలోనే నాన్నగారు చనిపోయారు. అప్పుడు కొన్ని భయాలు నన్ను మరింత వెంటాడాయి" అని తెలిపింది అమలాపాల్. అయితే "ప్రస్తుతం నా జీవితం సంతోషంగా ఉంది. నా పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్క సందర్భంలో కూడా నన్ను నేను ప్రోత్సహించుకుంటూ వచ్చిన తీరు నాకు బాగా నచ్చుతుంది" అని చెప్పుకొచ్చింది అమలాపాల్.