శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (17:23 IST)

శ్రీదేవిలా ఇంత తొందరగా లోకాన్ని విడిచి వెళ్ళిపోరు: అమితాబ్

అతిలోక సుందరి శ్రీదేవి మృతికి ముందే బిగ్ బి అమితాబ్‌ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ''ఎందుకో తెలీదు. మనుసులో ఏదో అలజడి రేగుతోంది'' అని అమితాబ్ ట్వీట్ చేశారు. శ్రీదేవి మరణ వార్త మీడియాలో రావటానికి కొన్న

అతిలోక సుందరి శ్రీదేవి మృతికి ముందే బిగ్ బి అమితాబ్‌ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ''ఎందుకో తెలీదు. మనుసులో ఏదో అలజడి రేగుతోంది'' అని అమితాబ్ ట్వీట్ చేశారు. శ్రీదేవి మరణ వార్త మీడియాలో రావటానికి కొన్ని నిమిషాల ముందే ఈ ట్వీట్‌ చేయటం విశేషం. దీంతో ఆమె చనిపోతారని అమితాబ్‌ ముందే ఊహించే ఆ ట్వీట్‌ చేశారా? అంటూ చర్చ సాగింది.
 
అమితాబ్‌కు సిక్స్త్ సెన్స్ పనిచేసిందని.. అందుకే ఆయన జరగబోయేది ముందే తెలిసిపోయి వుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. శ్రీదేవి హఠాన్మరణం అభిమానులు షాక్ తిన్నారు. ఈ విషాదంపై కొందరు సినీ ప్రముఖులు కవితలు రాసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా అమితాబ్ రెండు లైన్ల ట్వీట్లతో కవితను పోస్టు చేశారు. ''ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు.. అలా అని నీలా ఇంత తొందరగా లోకాన్ని విడిచి వెళ్ళిపోరు'' అని తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. అందాలతార శ్రీదేవి అద్భుతమైన నటి మాత్రమే కాదు.. ఓ మంచి కళాకారిణి కూడా. తాజాగా ఆమె పెయింటింగ్స్‌ను వేలం వేయనున్నారు. పాప్ రారాజు, మైకేల్ జాక్సన్ చిత్రాన్ని శ్రీదేవి గీసింది. ఈ పెయింటింగ్స్‌ను వేలానికి పెట్టనున్నారు. సావరియా చిత్రంలోని ఓ ఫోటోను కూడా శ్రీదేవి చిత్రంగా మలిచారు. ఈ రెండింటిని అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ వేలం వేయనున్నట్లు ప్రకటించింది.