నా ఫేవరేట్ లేదని నా హృదయం తల్లడిల్లిపోతోంది.. ఇక బర్త్‌డే ఎందుకు?

'అతిలోకసుందరి' శ్రీదేవి మరణాన్ని బాలీవుడ్ ప్రముఖులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా, పలువురు హీరోయిన్లు శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ బోరున విలపిస్తున్నారు.

Rani Mukerji
pnr| Last Updated: బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (21:10 IST)
'అతిలోకసుందరి' శ్రీదేవి మరణాన్ని బాలీవుడ్ ప్రముఖులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా, పలువురు హీరోయిన్లు శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ బోరున విలపిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఒకరు. ఈమె నటిగా ఉన్నప్పటికీ.. శ్రీదేవి అంటే చచ్చిపోయేంత అభిమానం. ఆమెతో వ్యక్తిగతంగా మంచి అనుబంధం కూడా ఉంది. దీంతో శ్రీదేవి ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేక వెక్కివెక్కి ఏడుస్తోంది.

ఈనేపథ్యంలో మార్చి 21వ తేదీన ఈమె పుట్టిన రోజు రానుంది. ఈ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, రాణీ ముఖర్జీ ఏమన్నారంటే.. "శ్రీదేవి జ్ఞాపకాలు ఇప్పట్లో మరచిపోలేనని, ఈసారి పుట్టినరోజు వేడుకలకు కూడా తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా" అని చెప్పింది.

ముఖ్యంగా, "నా ఫేవరెట్ (శ్రీదేవి) లేదని తెలిసి నా హృదయం తల్లడిల్లిపోతోంది. ఈసారి పుట్టినరోజు చేసుకోవాలని కూడా అనిపించడం లేదు. ఈ యేడాది నేను చాలా చాలా కోల్పోయాను" అంటూ కన్నీటిపర్యంతమవుతూ చెప్పుకొచ్చింది.

అదేసమయంలో ప్రస్తుతం తాను నటించే కొత్త చిత్రం "హిచ్‌కి" సినిమాను శ్రీదేవికి అందరికంటే ముందుగానే చూపించేందుకు తాను ఎలా ప్లాన్ చేసుకున్నానో మాటల్లో చెప్పలేనని తెలిపింది. కానీ, ఇంతలోనే...అంతా అయిపోతుందని కలలో కూడా ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.దీనిపై మరింత చదవండి :