Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవి దంపతులకు అనిల్ అంబానీకి మధ్యవున్న సంబంధమేంటి?

బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (16:42 IST)

Widgets Magazine
boly kapoor - anil ambani family

ఈనెల 24వ తేదీన దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి - బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ దంపతులకు ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మధ్య సంబంధం ఏంటనే విషయం ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇదే అంశంపై ఆరా తీయగా ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగుచూసింది. 
 
ఇంతలా చొర‌వచూపించ‌డానికి కార‌ణం ఇరు కుటుంబాల మ‌ధ్య ఉన్న బంధుత్వ‌మేనని తేలింది. అదెలాగంటే.. బోనీ కపూర్ సోదరి రీనా మార్వా కుమారుడైన మోహిత్ మోర్వాకు ఇటీవల దుబాయ్ వేదికగా వివాహం జరిగింది. ఇందులో వధువు పేరు అంతరా మోతివాలా. ఈమె (అంతరా) అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి స్వయానా అక్క కూమార్తె. ఈ పెళ్లితో అంబానీలకు బోనీ కపూర్ ఫ్యామిలీతో దగ్గరి సంబంధం ఏర్పడింది. 
 
అందుకే శ్రీదేవి దుబాయ్‌లో మరణించారన్న వార్త తెలియగానే అనిల్ అంబానీ తన ప్రత్యేక జెట్ ఫ్లైట్‌ను ఆగమేఘాలపై ముంబై నుంచి దుబాయ్‌కు పంపించారు. ఆ తర్వాత శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించడంలో తీవ్రజాప్యం జరిగినప్పటికీ.. ఫ్లైట్‌ను అక్కడే ఉంచారు. ఆ తర్వాత మంగళవారం రాత్రి శ్రీదేవి భౌతికకాయంతో ఈ ప్రత్యేక ఫ్లైట్ దుబాయ్ నుంచి బయలుదేరి ముంబైకు వచ్చింది. 
 
అంతేనా.. భార్యను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న బోనీ కపూర్‌కు అనిల్ అంబానీ ఎంతో అండగా ఉన్నారు. ఓదార్చారు. మేన‌ల్లుడు మోహిత్ మార్వా పెళ్ళిలో స‌ర‌దాగా గ‌డిపిన శ్రీదేవి రెండు రోజుల‌లో విగ‌తజీవిగా మార‌డం బోనీ ఎంతో ఆవేద‌న‌కు గురయ్యాడు. అలాంటి సమయంలో అనిల్ అంబానీ ఆయనకు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు. 
 
అంతేకాకుండా, శ్రీదేవికి సంబంధించి కార్యక్రమాల‌న్నింటినీ ద‌గ్గ‌రుండిమరీ చూసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయం వచ్చే సమయానికి ముంబై విమానాశ్రయానికి అనీల్ క‌పూర్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు. అక్కడ నుంచి భౌతికకాయాన్ని ముంబైలోని లోఖండ్ వాలాలోని శ్రీదేవి సొంత నివాసమైన గ్రీన్ ఏకర్స్‌కి ఆయన దగ్గరుండి తరలించారు. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి గ్రీన్ ఏకర్స్‌కు ఆయన స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ రావడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా ఆరాధ్య దేవత మరలిరాని లోకాలకు తరలిపోయింది : కన్నీరు తెప్పిస్తున్న ఆర్జీవీ ట్వీట్

వివాదాలు ఏరికోరి తెచ్చుకునే దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. అలాగే, నటి శ్రీదేవి అంటే ...

news

శ్రీదేవికి నచ్చిన తెలుపు పువ్వులతోనే అంతిమ యాత్ర.. ప్రియా వారియర్ నివాళి

ప్రముఖ సినీ నటి శ్రీదేవి అంతిమ యాత్ర అభిమానుల అశ్రునయనాల మధ్య జరుగుతోంది. ఈ నేపథ్యలో ...

news

బంగారు రంగు చీరలో... ఏడు వారాల నగలతో : మానవా.. ఇక సెలవ్ అంటూ... (వీడియో)

భూలోక అతిలోక సుందరి శ్రీదేవి అంతియ యాత్ర ముంబైలో లక్షలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య ...

news

శ్రీదేవి అంతియ యాత్ర ప్రారంభం : ప్రభుత్వ అధికార లాంఛనాలతో

నటి శ్రీదేవి అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ముంబైలోని హిందూ శ్మశానవాటికలో ...

Widgets Magazine