చివరి కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిన 'అతిలోక సుందరి'

సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (09:46 IST)

sridevi - jahnavi

తన కుమార్తెను వెండితెరపై చూసి మురిసిపోవాలనుకున్న వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి.. చివరకు ఆ కోరిక తీరకుండానే దివికేగింది. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి... గుండెపోటు హఠాన్మరణం చెందారు. దీంతో బోనీ కపూర్ కుటుంబం ఒక్కసారి షాక్‌కు గురైంది. భర్త బోనీ కపూర్‌కు ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా వుండే శ్రీదేవి ఒక్కసారిగా దూరంకావడంతో ఆయన దిక్కులేని మనిషిగా మారిపోయాడు. 
 
అయితే, 54 యేళ్ల శ్రీదేవి... 42 యేళ్ళ పాటు వెండితెరపై రాణించింది. బాలనటి నుంచి హీరోయిన్‌గా రాణించి, ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంది. అలాగే, ఆమె పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్‌ను కూడా వెండితెరపై హీరోయిన్‌గా చూసి మురిసిపోవాలనుకుంది. జాహ్నవి నటిస్తున్న తొలి సినిమా 'ధడక్' మరో రెండు - మూడు నెలల్లో విడుదలకానుంది. అయితే తన కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన శ్రీదేవి తన కూతురిని వెండితెర మీద చూడకుండానే మృతి చెందింది. దీనిపై మరింత చదవండి :  
కుమార్తెలు జాహ్నవి బోనీ కపూర్ Dubai Daughters Jhanvi Khushi Bony Kapoor శ్రీదేవి Sridevi Passes Away

Loading comments ...

తెలుగు సినిమా

news

దుబాయ్‌లోనే శ్రీదేవి భౌతికకాయం.. ఎందుకంటే...

హఠాన్మరణం చెందిన అందాల నటి శ్రీదేవి భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకునిరావడంలో తీవ్ర ...

news

మైఖేల్ జాక్సన్ - శ్రీదేవిల మృతి కారణం ఇదేనా?

అతిలోకసుందరి శ్రీదేవి హఠాన్మరణానికి కారణాలపై పలువురు పలు విధాలుగా విశ్లేషిస్తున్నారు. ...

news

ఓ మంచి మనిషీ మళ్ళీ పుట్టవా : నటి శారద

సినీ నటి శ్రీదేవి మరణంపై సీనియర్ నటి శారద స్పందించారు. ఓ మంచి మనిషీ మళ్లీ పుట్టవా ...

news

బాత్రూమ్‌లో కుప్పకూలడం వల్లే శ్రీదేవి చనిపోయిందా?

అందాల సుందరి శ్రీదేవి మరణంపై ఓ వార్త ట్రెండ్ అవుతోంది. నిజానికి ఆమె గుండెపోటుతో ...