మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (19:34 IST)

''సైరా''తో బిగ్ బి: త్వరలో షూటింగ్ స్పాట్‌‍కి అమితాబ్

ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే సైరా నరసింహారెడ్డి అనే పదాన్ని మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా టైటిల్‌గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణ

ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే సైరా నరసింహారెడ్డి అనే పదాన్ని మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా టైటిల్‌గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇంతకాలమైనా సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఇంతవరకు ఫస్ట్‌లుక్ మాత్రమే విడుదల చేశారు. 
 
సైరాకు సంబంధించిన కొత్త స్టిల్స్, ట్రైలర్స్ ఎప్పుడొస్తాయా అంటూ మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ.. ''సైరా'' సెట్స్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 
 
ఈ విషయాన్ని 'సైరా' యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సైరా నుంచి బిగ్ బి తప్పుకున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగిన తరుణంలో.. అమితాబ్ సైరా షూటింగ్‌లో పాల్గొంటారని యూనిట్ తెలిపింది. మరోవైపు, ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతారను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.