1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (10:53 IST)

అమర జవాన్ల కుటుంబాలకు అమితాబ్ భారీ ఆర్థికసాయం

బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ నిజంగానే రియల్ హీరో అని మరోమారు అనిపించుకున్నారు. గతంలో పలుమార్లు కూడా తాను రీల్ హీరో కాదనీ, రియల్ హీరో అని నిరూపించుకున్నారు. తాజాగా మరోమారు ఆయన ఇదేవిధంగా నడుచుకున్నారు.
 
జమ్మూకాశ్మీర్లో సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌పై జ‌రిగిన ఉగ్ర‌దాడిలో ఇప్పటివ‌ర‌కు 49 మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు అండగా నిలిచేందుకు చాలా మంది సెలెబ్రిటీలు తమ వంతు సాయం చేసందుకు ముందుకు వస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, పుల్వామా దాడిలో అసువులు బాసిన వీరజవాన్ల కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున విరాళంగా మొత్తం రూ.2.5 కోట్లు ప్రకటించారు. టాలీవుడ్ నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా త‌న‌కి తోచినంత సాయాన్ని వీర‌జ‌వాన్ల కుటుంబాల‌కు ప్రకటించారు.
 
గతంలో దేశానికి వెన్నుద‌న్నుగా నిలిచిన రైత‌న్నని ఆదుకొని ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచారు. మ‌హారాష్ట్రకి చెందిన 350 మంది రైతుల లోన్స్‌ని మాఫీ చేయించాడు. ఉత్తర ప్ర‌దేశ్‌లోని రైతు కుటుంబాల‌కి చెందిన వారి లోన్స్ మాఫీ కోసం అమితాబ్ 4.05 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు. 
 
అలాగే, బ‌ల‌వంతంగా వ్య‌భిచార గృహాల్లోకి నెట్టి వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసే వారి నుంచి యువ‌తుల‌ని ర‌క్షించి వారి కోసం పాటు ప‌డుతున్న అజీత్ సింగ్‌కి కూడా అమితాబ్ కొంత మొత్తం ఇస్తామ‌ని అన్నారు.