బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2023 (17:09 IST)

మోహన్‌లాల్‌తో పెళ్లి సందడి రోషన్ "వృషభ"

Mohanlal_Roshan
Mohanlal_Roshan
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి ‘వృషభ’ అనే పాన్-ఇండియన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రోషన్ సరసన నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షానాయ కపూర్ నటిస్తోంది. 
 
పెళ్లి సందడిలో రోషన్ సూపర్ హిట్‌గా నటించాడు. ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. "వృషభ"ని అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహీ పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా సహ నిర్మాతలు. 
 
తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా పండుగకు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.