Widgets Magazine

యాంకర్ ప్రదీప్‌కు జైలుశిక్ష తప్పదా?

మంగళవారం, 9 జనవరి 2018 (16:55 IST)

Widgets Magazine
Pradeep

పీకల వరకు మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేసిన కేసులో పట్టుబడిన బుల్లితెర యాంకర్ ప్రదీప్‌కు శిక్షపడే అవకాశం ఉన్నట్టు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ఆయన నేరాన్ని అంగీకరించడమేకాకుండా, భవిష్యత్‌లో మద్యం సేవించి డ్రైవింగ్ చేయబోనని పోలీసులకు హామీ ఇచ్చాడు. ఇదే అంశాన్ని పోలీసులు చార్జిషీట్‌లో పొందుపరిచి కోర్టుకు సమర్పించనున్నారు. దీంతో ఆయనకు కోర్టు శిక్ష వేసే అవకాశం ఉందనీ న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
గత యేడాది డిసెంబరు 31వ తేదీ అర్థరాత్రి కొత్త సంవత్సరం వేడుకల్ల్ పాల్గొన్న ప్రదీప్.. పీకల వరకు మద్యం సేవించి కారు నడిపుతూ పోలీసులకు చిక్కాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం గోషామహల్‌ ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో గంటసేపు జరిగిన కౌన్సెలింగ్‌కు తన తండ్రితో కలిసి హాజరయ్యాడు. 
 
ఇక ముందు అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ప్రదీప్‌ హామీ ఇచ్చినట్లు ట్రాఫిక్‌ అదనపు డీసీపీ అమర్‌కాంత్‌రెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌ పూర్తయినందున, ఆయా విషయాలతో చార్జిషీట్‌ రూపొందించి కోర్టులో దాఖలు చేస్తామని, అతనికి జరిమానానా లేదా శిక్ష పడుతుందా? అన్న విషయాన్ని కోర్టు నిర్ధారిస్తుందని ఆయన వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'చెన్నై చంద్రం'పై నిర్మాత ఫిర్యాదు.. ఎందుకంటే...

చెన్నై చంద్రంగా పేరుగాంచిన నటి త్రిష ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై ఓ తమిళ నిర్మాత ...

news

'అజ్ఞాతవాసి' అదిరిపోయిందట... 'బాహుబలి'ని బ్రేక్ చేస్తుందేమో? రెండురోజులు కుమ్ముడే...

రేపు విడుదల కానున్న అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ అభిమానులు ఆత్రుతగా వేచి చూస్తున్నారు. ...

news

రోజా తీరు బాగుండటంలేదు.. కోట శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతో తీవ్రస్థాయిలో తిట్లు తింటున్న రోజాకు సినీనటుల నుంచి ...

news

''భాగమతి'' ట్రైలర్ బాగుంది.. స్వీటీని పొగిడిన డార్లింగ్

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క టైటిల్‌ రోల్‌లో ''పిల్ల జమీందార్'' ఫేమ్‌ జి.అశోక్‌ ...