Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను చేసిన తప్పు మరెవరూ చేయకూడదు... యాంకర్ ప్రదీప్ (వీడియో)

శుక్రవారం, 5 జనవరి 2018 (09:27 IST)

Widgets Magazine
pradeep

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన స్టార్ యాంకర్‌ ప్రదీప్‌ గురువారం కూడా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. నూతన సంవత్సర వేడుకల రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో ప్రదీప్‌ పట్టుబడ్డాడు. అతడు అధిక మోతాదులో మద్యం తాగినట్టు (178ఎంజీ/100ఎంల్‌) పరీక్షలో తేలింది. 
 
దీంతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు పట్టుబడుతున్నా ప్రదీప్‌ రాకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ ఓ వీడియో ద్వారా స్పందనను తెలియజేశాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని ప్రదీప్‌ తెలిపాడు. 
 
'డిసెంబర్‌ 31 నాటి ఘటన విచారకరం. నేను డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమే. తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నా. నేను చేసిన తప్పు మరెవరూ చేయకూడదు. నాపై అనేక అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి. ఎవరూ నమ్మవద్దు. ముందస్తుగా అంగీకరించిన కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నా. పోలీసుల సూచనల మేరకు కౌన్సిలింగ్‌కు హాజరవుతాన'ని వీడియోలో పేర్కొన్నాడు ప్రదీప్. 
 
అంతేకాకుండా, అధికారుల నుంచి వచ్చిన సూచనల ప్రకారమే నడుచుకుంటున్నానని ఓ వీడియో ద్వారా ప్రదీప్ చెప్పాడు. చట్టానికి లోబడే ఉంటాను కానీ అతిక్రమించనని తెలిపారు. పోలీసులు ఇచ్చే కౌన్స్‌లింగ్‌తో పాటు దాని తర్వాత జరిగే వాటికి కూడా హాజరవుతానని చెప్పారు. 
 
డ్రంకన్ డ్రైవ్ విషయంలో చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటంన్నిటినీ స్వీకరిస్తానని ఆయన అన్నారు. అంతేకాకుండా డ్రంకన్ డ్రైవ్ మీద గతంలో ఓ వీడియో చేశానని దానిని ఉల్లంఘించినందుకు క్షమించండి అంటూ ప్రేక్షులను ఆయన కోరారు. అంతేకాక నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదని అని విజ్ఞప్తి చేశాడు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"కొడకా... కోటేశ్వర్రావూ ఖరుచైపోతవురో" అంటున్న పోలెండ్ బుజ్జి.. పవన్ ఫిదా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల 10వ తేదీన ...

news

అక్కినేని నాగార్జున అందరిలో ఒకరు... అంతేనట, కేంద్రం లైసెన్స్ రద్దుపై...

తమ పార్టీకి వ్యతిరేకంగా లేదా తమ పార్టీకి మద్దతు ప్రకటించని ప్రముఖులపై ఐటీ దాడులు, ఈడీ ...

news

ఆ.... అని ఆశ్చర్యపరచిన నాని 'అ' టీజర్(వీడియో)

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత యేడాది మూడు విజయాలు నమోదు ...

news

మరోసారి "తొలిప్రేమ" సినిమాలో కనిపించనున్న పవన్ కళ్యాణ్??

తొలిప్రేమ సినిమా "పవన్ కళ్యాణ్" సినీ జీవితంలో నేటికీ ఒక మరుపురాని చిత్రంగా ఉంది. ఈ చిత్రం ...

Widgets Magazine