Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రవాసాంధ్రులకు "అజ్ఞాతవాసి" సందేశం (వీడియో)

గురువారం, 4 జనవరి 2018 (15:07 IST)

Widgets Magazine
pawan kalyan

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల 10వ తేదీన రిలీజ్ కానుంది. ‘అత్తారింటికి దారేది’లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. 
 
ఈ చిత్రం జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. అయితే, ఓవర్సీస్‌లో మాత్రం మనకంటే ముందే రిలీజ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు భారీ విడుదలకు ఏర్పాట్లుచేశారు. తన సినిమాపై ఎంతో ప్రేమ, ఆదరణ కనబరుస్తున్న ప్రవాసీయులకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో... 
  
"ప్రవాసలో ఉన్న తెలుగు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉన్న ఊరిని వదిలి పక్క ఊరికి వెళ్లి పనిచేయడమే ఎంతో కష్టమో నాకు తెలుసు. అలాంటిది రాష్ట్రాన్ని వదిలి.. దేశాన్ని.. వదిలి దేశం కాని దేశంలో చదువుకోవడం.. అక్కడ ఉద్యోగం చేయడం ఇంకెంతో కష్టం. దాంతో పాటు ఆత్మ గౌరవం దెబ్బతినకుండా జీవితాన్ని ఏర్పరచుకోవడం, అక్కడ స్థానికతను సంపాదించుకోవడం ఎంత కష్టమో నాకు చాలా బాగా తెలుసు. అందుకే నాకు మీరంటే చాలా గౌరవం. మీరెక్కడున్నా.. మీ వెనుక మీతో పాటు మేమున్నాం. అక్కడ మీకు చిన్న సమస్య ఎదురైతే మీకు అండగా కోట్ల గొంతులు ఇక్కడ అండగా నిలబడతాయి.
 
సరిగ్గా 18 సంవత్సరాల క్రితం "బద్రీ" సినిమా అమెరికా దేశంలో విడుదలైనప్పుడు.. ఏవో కొద్దిపాటి సెంటర్లలో విడుదల అవగానే అది చాలా పెద్ద విజయంగా నాకు చెప్పారు. అలాంటిది ఈరోజు "అజ్ఞాతవాసి" సినిమా ఏ భారతీయ చలన చిత్రానికీ ఇవ్వనంత భారీ విడుదల ఇస్తున్నందుకు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. మీరు చూపించే ఈ ప్రేమకు, గౌరవానికి శిరస్సు వంచి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా" అంటూ పవన్ కళ్యాణ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరో నాగార్జునకు షాకిచ్చిన కేంద్రం.. గుర్తింపు రద్దు

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అక్కినేని కుటుంబానికి ...

news

వివాదాల్లో పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'... రంగంలోకి 'బాహుబలి' రానా... ఎందుకు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి చిత్రం సంక్రాంతి పండుగకు ముందే ...

news

"అజ్ఞాతవాసి" స్టోరీ లీక్ : హీరో పేరు ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కి ఈనెల 10వ తేదీన ...

news

ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలంటున్న గీత రచయిత్రి

సమాజంలో మహిళలు ప్రతిచోటా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. సినీ ఇండస్ట్రీలో అయితే ...

Widgets Magazine