Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చలపతిరావు కామెంట్స్‌-సూపరన్న రవి.. నాంపల్లి కోర్టుకు హాజరు

బుధవారం, 10 జనవరి 2018 (12:54 IST)

Widgets Magazine
anchor ravi

'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి నటుడు చలపతిరావు అభ్యంతరకర కామెంట్స్ చేయడం, దానికి యాంకర్ రవి సూపర్ అంటూ సమర్థించడంపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది.

అయితే ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, తనకు ఏ పాపం తెలియదని, అపుడు చలపతిరావు ఏం మాట్లాడారో నాకు వినిపించలేదని, ఆయన అంత నీచమైన కామెంట్స్ చేసారని తర్వాత తెలిసిందని యాంకర్ రవి వివరణ ఇచ్చారు. 
 
అయినప్పటికీ మహిళా సంఘాలు వెనక్కి తగ్గలేదు. చలపతిరాలు, యాంకర్ రవిలపై మండిపడ్డాయి. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా బుధవారం ఉదయం యాంకర్ రవి నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు.

ఈ కేసులో భాగంగా కోర్టు వాయిదా నిమిత్తం రవి నాంపల్లికి వచ్చాడు. ఆపై తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, తన మాటలను మీడియా వక్రీకరించిందని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం తానేమీ వ్యాఖ్యానించరని తెలిపాడు. కేసు విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలుపుతామని రవి వ్యాఖ్యానించాడు. 
 
కాగా గతంలో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో ఫంక్షన్ జరిగిన వేళ, అమ్మాయిలు పనుకునేందుకు బాగా పనికి వస్తారని అని సీనియర్ నటుడు చలపతిరావు వ్యాఖ్యానించగా, 'సూపర్ సార్' అని యాంకర్ రవి సమర్థించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'కోటేశ్వర రావు'లు హర్ట్ అవుతున్నారు... పవన్ సారీ చెప్పేస్తాడేమోలే...

ఇల్లు కాలి ఒకడేడుస్తోంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట వెనకటికొకడు.. అలా ఉంది.. ...

news

కత్తి మహేష్ రిపోర్ట్... ''అజ్ఞాతవాసి'' చెత్త సినిమా.. చికాకు పెట్టారు...

అజ్ఞాతవాసి ''చెత్త సినిమా'' అనేశాడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్. పవర్ స్టార్ పవన్ ...

news

పవన్ అజ్ఞాతవాసి మానియా మామూలుగా లేదుగా? చూడండి ఈ ఊరేగింపు(video)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మానియా మామూలుగా లేదు. పవన్ అభిమానుల కోలాహలం ...

news

గీతా ఆర్ట్స్‌తో అర్జున్ రెడ్డి సినిమా.. సాదాసీదా హారర్ థ్రిల్లర్ కాదు..

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఓ ...

Widgets Magazine