పెళ్ళిని దాచగలంకాని.. గర్భాన్ని ఎలా దాచగలం.. గాసిప్ రాయుళ్ళకు అనుష్క కౌంటర్
బాలీవుడ్ హీరోయిన్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క గాసిప్ రాయుళ్ళకు గట్టగా కౌంటర్ ఇచ్చింది. పెళ్లిని దాచగలంకాని, గర్భాన్ని ఎలా దాచగలం అంటూ కౌంటరిచ్చింది.
విరాట్ కోహ్లీని అనుష్క పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ పెళ్లి తర్వాత ఆమె ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు. దీంతో అనుష్క గర్భందాల్చిందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
దీనిపై అనుష్క స్పందించింది. తద్వారా గాసిప్ రాయుళ్ళకి గట్టిగా బుద్ది చెప్పినట్టయింది. పెళ్ళిని దాచగలం కాని, గర్భాన్ని ఎలా దాచగలం. అర్థం పర్ధంలేని ఇలాంటి కామెంట్స్‌ని తాను అస్సలు పట్టించుకోను అని చెప్పారు. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు దాదాపు ఇలాంటి అసత్య వార్తలను ఎదుర్కొనే ఉంటారు.
ఇలాంటి పుకార్లు పెళ్లి కాకుండానే వివాహితను, గర్భం దాల్చకుండానే తల్లిని చేసేస్తుంటాయని మండిపడింది. ప్రస్తుతం తాను బిజీ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నానని చెప్పిన అనుష్క ఈ డిసెంబర్ 21న "జీరో" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపింది. ఇందులో మానసికి రోగిగా నటిస్తున్నట్టు ఆమె వెల్లడించింది.