Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'కేక' పెట్టిస్తున్న అర్జున్ రెడ్డి... తొలిరోజు కలెక్షన్స్ రూ. 2,47,00,000

శనివారం, 26 ఆగస్టు 2017 (20:09 IST)

Widgets Magazine

ముద్దు సీన్ పోస్టర్లను బస్సులు, హోర్డింగులపై అతికించడమే కాకుండా సీనియర్ నాయకుడు వీహెచ్ ను సైతం అంకుల్... చిల్ అంటూ సెటైర్లు వేసిన అర్జున్ రెడ్డి మూవీ టీం తాము అనుకున్నది సాధించేసింది. అటు సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలను, ఇటు ఎప్పుడూ ట్విట్టర్ ముందు కూర్చుని తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసే వర్మని బాగా ఇంప్రెస్ చేసేశారు. ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. 
Arjun Reddy
 
ముద్దు సీన్ పైన కొందరు ఘాటుగా స్పందించారు కానీ... ప్రేక్షకులు మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. చిత్రాన్ని మామూలుగా కాదు... ఓ రేంజిలో చూస్తున్నారంటే నమ్మండి. పిచ్చపిచ్చగా చూసేస్తున్నారు. తొలి రోజే ఈ చిత్రం రూ. 2.47 కోట్లను వసూలు చేసిందంటే ఇక దాని స్టామినా వేరే చెప్పాలా? సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'అర్జున్ రెడ్డి'లో షాలిని పాండే కథానాయికగా నటించింది. 
 
వసూళ్ల లెక్క చూస్తే  నైజాంలో రూ. 1.22 కోట్లు, సీడెడ్లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, తూ.గోలో రూ.12 లక్షలు, ప.గోలో రూ.9 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, గుంటూరులో రూ.20 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలను రాబట్టి సన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తమ్మీద చిన్న సినిమా ఈ స్థాయిలో దూసుకుపోతుండటంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బేలగా నటి శ్రియ... శ్రీవారిని దర్శించుకుని తలవంచుకుని...(వీడియో)

ప్రముఖ నటి శ్రియ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో స్వామి సేవలో ...

news

ఆమెను కలిసిన తరువాతనే నా దశ తిరిగింది... తిరుమలలో నటుడు ఆది(వీడియో)

నటుడు ఆదిని సాయికుమార్ కుమారుడు అంటేనే ఎక్కువమంది గుర్తుపడతారు. ఆది కొన్ని సినిమాల్లో ...

news

కమల్‌ను కడిగేసిన గౌతమి.. ఆ మాటలు వింటే..

వారిద్దరు ఇష్టపడ్డారు. కానీ పెళ్ళి చేసుకోలేదు. 13 యేళ్ళు సహజీవనం చేశారు. ఆ తరువాత ...

news

అర్జున్ రెడ్డిని ఆకాశానికెత్తేసిన ఆర్జీవీ... తెలింగాణలో తొలి మెగాస్టార్.. అమితాబ్‌లా..

అర్జున్ రెడ్డి ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అమితాబ్‌లా ...

Widgets Magazine