అమెరికా టెక్సాస్ లో బాలక్రిష్ణ డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ కు ఏర్పాట్లు
నందమూరి బాలక్రిష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటోన్న డాకూ మహరాజ్. ప్రగ్యా, శ్రద్ధాశ్రీనాథ్, చాందినిచౌదరి నాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ను ఘనంగా జరపాలని చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అమెరికాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి .టెక్సాస్ లో జనవరి 4వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాతలు పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నారు.
టెక్సాస్ లో ట్రస్ట్ కూ థియేటర్ లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈ వెంట్ కు సంబంధించిన టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభమైంది. థిాయేటర్ కు మించి అభిమానులు రాకూడదని నిబంధన వున్నందున పరిమితి టికెట్ల విక్రయం జరిగినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. శ్రేయాస్ మీడియా ఈవెంట్ బాధ్యతలు నిర్వహిస్తుంది.