గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (17:40 IST)

అషురెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్.. వర్మ కేక్ కట్ చేసి తినిపించాడు..

తెలుగు బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ అషురెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ రాత్రి ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రచ్చ చేశారు. 
 
తనదైన స్టైల్‌లో అషురెడ్డి చేతిని పట్టుకుని కేక్ కట్ చేయించి, ఆమెకు తినిపించారు. ఈ బర్త్ డే పార్టీకి సినీ నటి హేమ, హరితేజ, బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్, జబర్దస్త్ పవిత్ర తదితరులు కూడా హాజరయ్యారు. 
 
మరోవైపు అషురెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమె తండ్రి బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన C200D అనే మోడల్ కారును తన కూతురికి బర్త్ డే గిఫ్ట్‌గా ఇచ్చారు అషురెడ్డి తండ్రి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.