శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (13:35 IST)

బాబా భాస్క‌ర్ చాలా ముదురే - నాగార్జున‌

Baba Bhaskar, Nagarjuna
Baba Bhaskar, Nagarjuna
ఓటీటీలో ప్ర‌సారం అవుతున్న బిగ్‌బాస్ షో ఎనిమిద‌వ వారంలోకి అడుగుపెట్టింది. ఇటీవ‌లే న‌టుడు మ‌హేష్ విట్టా ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ షోను ఇంకాస్త జోష్‌గా తెచ్చేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఉప‌యోగించాల‌ని కొంత‌కాలంగా వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని నిజం చేస్తూ తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో డాన్స్ కొరియోగ్రాఫ‌ర్ బాబా భాస్క‌ర్‌ను ఆహ్వానించింది.
 
టీవీషోల‌లోనూ బాబా భాస్క‌ర్ జోవియ‌ల్‌గా చిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఇది చూసేవారికి ఓవ‌ర్ చేస్తున్నాడ‌నిపించినా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అందుకే ఈయ‌న్ను ఎన్నుకున్న‌ట్లు తెలిసింది. బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త కంటెస్టెంట్‌గా బాబా భాస్క‌ర్‌ను హోస్ట్‌గా వున్న నాగార్జున స్వాగ‌తం ప‌లికారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుద‌ల చేశారు. నేనుకున్నంత స్ట్రెయిట్‌గాలేరు. చాలా ముదురుగా వున్నారంటూ.. బాబా రాగానే నాగార్జున సెటైర్ వేశారు. ఆయ‌న రాగానే బిగ్‌బాస్ హౌస్ సీక్రెట్ రూమ్‌లోకి తీసుకెళ్ళారు.