కేటిఆర్‌కి షాకిచ్చిన 'బాహుబలి' సుబ్బ‌రాజు, ఏం చేశాడో తెలుసా?

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఏంటి..? తెలంగాణ రాష్ట్ర మంత్రికి షాక్ ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే... కేటిఆర్... శుక్రవారం ఫ్యామిలీ ఫంక్ష‌న్‌కి వెళ్లారు. అక్క‌డ కేటిఆర్‌ని చూసిన ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు వెంట‌నే ఆయ‌న ద‌గ్గ‌ర‌కి వెళ్లి ఓ చెక్ ఇచ్చార

Subbaraju
srinivas| Last Modified శనివారం, 4 ఆగస్టు 2018 (16:21 IST)
క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఏంటి..? తెలంగాణ రాష్ట్ర మంత్రికి షాక్ ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే... కేటిఆర్... శుక్రవారం ఫ్యామిలీ ఫంక్ష‌న్‌కి వెళ్లారు. అక్క‌డ కేటిఆర్‌ని చూసిన ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు వెంట‌నే ఆయ‌న ద‌గ్గ‌ర‌కి వెళ్లి ఓ చెక్ ఇచ్చార‌ట‌. అంతే.. కేటిఆర్ సుబ్బ‌రాజు ఏంటి నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి చెక్ ఇవ్వ‌డం ఏంటంటూ షాక్ అయ్యార‌ట‌.
 
ఇదే విష‌యాన్ని కేటిఆర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఇంత‌కీ కేటిఆర్ ట్విట్ట‌ర్లో ఏమ‌ని స్పందించారంటే... శుక్ర‌వారం రాత్రి నేను ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఉండగా.. సుబ్బరాజు నావైపు నడుచుకుంటూ రావడం ఆశ్చర్యంగా అనిపించింది. రాగానే ఆయన సీఎంఆర్‌ఎఫ్ కోసం ఓ చెక్‌ను కంట్రిబ్యూట్ చేశారు. చాలా కృతజ్ఞతలు బ్రదర్ అని ట్వీట్ చేశారు కేటీఆర్. సినిమాలో విల‌న్ పాత్రలు పోషించిన సుబ్బ‌రాజు… రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ సుబ్బ‌రాజుని అభినందిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :