శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (18:59 IST)

బాలకృష్ణకు కరోనా: పూర్తి ఆరోగ్యంగా వున్నాను

balakrishna
సినీ నటుడు, హిందూపూర్​ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధ్రువీకరించారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని బాలకృష్ణ కోరారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించిన బాలకృష్ణ.. త్వరలోనే సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
'అఖండ' విజయంతో జోరు మీదున్న బాలకృష్ణ...  ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీలో నటిస్తున్నారు. ఇందులో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తోంది. 
 
దీని తర్వాత ఎఫ్3 డైరెక్టర్ అనిల్‌ రావిపూడితో కలిసి ఓ విభిన్నమైన స్టోరీతో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు వ్యాఖ్యాతగానూ బాలకృష్ణ మరోసారి అలరించనున్నారు. 'అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2'తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.