భానుమతి రామకృష్ణ సినిమా వివాదం, ఇంతకీ ఏమైంది..?

Bhanumati Ramakrishna movie still
శ్రీ| Last Modified బుధవారం, 1 జులై 2020 (22:52 IST)
నవీన్ చంద్ర నటించిన తాజా చిత్రం భానుమతి రామకృష్ణ. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించారు. వెబ్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్‌కు మంచి స్సందన రావడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని ఆహా ద్వారా రిలీజ్ చేయడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.

నూతన దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే టాక్ ఉంది. అయితే... ఊహించని విధంగా ఈ సినిమాపై వివాదం వచ్చిపడింది. ఇంతకీ వివాదం ఏంటంటే... ఈ మూవీ టైటిల్ భానుమతి రామకృష్ణ.

ఇంతకీ విషయం ఏంటంటే.... అలనాటి నటి భానుమతి రామకృష్ణ తనయుడు, మా అమ్మ పేరును టైటిల్‌గా పెట్టడం ఏంటి..? అని ప్రశ్నించారు. తమని సంప్రదించకుండా ఆ టైటిల్ ఎందుకు పెట్టారు...? అంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు.

ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే... భానుమతి రామకృష్ణ మూవీ టీమ్ మాత్రం ఆమె పేరుకు ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. అయితే... అల్లు అరవింద్ రంగంలోకి దిగారని... ఇప్పుడు ఎలాంటి వివాదం లేదని అంటున్నారు. మొత్తానికి ఈ చిన్న సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. సో... ఆశించిన సక్సెస్ సాధించడం ఖాయం అంటున్నారు టీమ్.దీనిపై మరింత చదవండి :