సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (09:46 IST)

బిగ్‌బాస్ సీజన్ 5: ఫస్ట్ వీకే ఇంటి బాట పట్టేది ఎవరు?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభమై అప్పుడే వారం కావొస్తోంది. యాంకర్ రవి, హమీద, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, మానస్, సరయులు నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఫస్ట్ వీకే ఇంటి బాట పట్టేది ఎవరు అన్న ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది.
 
అయితే పలు పోలింగ్స్ ప్రకారం.. తొలి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మోడల్ జశ్వంత్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈయన మొదట్లో చాలా సైలెంట్గా ఉన్నప్పటికీ.. క్రమక్రమంగా అవసరం ఉన్నా లేకపోయినా ఆవేశపడుతూ ఆదిలోనే అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు.
 
ఎప్పుడూ సిరి జపం చేసే జెస్సీ ఆమెతో తప్ప మిగతావాళ్లతో పెద్దగా కలవట్లేదు. గేమ్‌లోనూ చురుకుగా పాల్గొంటున్నట్లు కనిపించడం లేదు. పైగా హమీదాతో పిల్లి వివాదం, యానీ మాస్టర్‌తో కుర్చీ వివాదం కూడా అతడికి మైనస్‌లుగా మారినట్లు తెలుస్తోంది.
 
ఈ నేపథ్యంలోనే ఆయనకు చాలా తక్కువ ఓటింగ్ వచ్చిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు గత సీజన్స్‌తో పోల్చుకుంటే ఈ సారి గేమ్ షో మరింత రసవత్తరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ మధ్య ఏడుపులు, గొడవలు, అల్లర్లు అన్నీ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 
 
ఇక ఐదో రోజు బిగ్ బాస్ హౌస్‌లో హడావిడి మాములుగా లేదు. ఈ సారి కాజల్‌తో వాదనకు దిగారు ప్రియా , శ్రీరామ్. వంట చేయమన్నందుకు రచ్చ రచ్చ చేసింది కాజల్. నాకు వంట రాదు. నేను కిచన్ మొహం కూడా చూడలేదు అంటూ వాదించింది కాజల్. దాంతో హౌస్ లో మరో గందరగోళం ఏర్పడింది.
 
'నేను ఎప్పుడు వంట చేయలేదు.. కిచెన్ మొహమే చూడలేదు' అని కాజల్ అనడంతో ఆమె పై వాదానికి దిగారు ప్రియా, శ్రీ రామ్. వెంటనే శ్రీరామ్ మాట్లాడుతూ.. 'తెలుగు వాళ్లలో ప్రతి ఒక్క ఆడవాళ్లు సాధారణంగా వంట చేస్తారు.. మీరు అలా అంటే ఎలా? నాకు కూడా వంట రాదు.. అయినా నేను ఇక్కడ సామాన్లు కడుగుతున్నాను' అంటూ శ్రీరామ్ అంటూ అరిచేశాడు. 
 
ఇంతలో అక్కడే ఉన్న ప్రియ అందుకొని .. 'కనీసం సామాన్లు కడుగుతావా..? వంట రాదు అంటే కనీసం సామాన్లు కడుగుపోనీ..? అని అంది. దాంతో మరోసారి కాజల్ 'ఐ డోంట్ వాంట్ కిచెన్ అంటున్నాను ప్రియాగారు' అంటూ పొగరు చూపే ప్రయత్నం చేసింది. ఇక కెఫ్టెన్ సిరి కూడా కాజల్‌ని సమన్లు కడిగేలా ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయినా కాజల్ వెనక్కి తగ్గదు.