శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (15:35 IST)

నటుడిగా కాదు.. ఇక నాయకుడుగా కనిపించాలి : హీరో విజయ్ తండ్రి

తమిళ హీరో విజయ్‌ పేరుపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన తండ్రి చంద్రశేఖర్ స్పందించారు. తన కొడుకు హిందూ కాదు, క్రిష్టియన్ కాదు.. భారతీయుడు... అని పేరు అలా ఉంటే తప్పా? అంటూ నిలదీశారు.

తమిళ హీరో విజయ్‌ పేరుపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన తండ్రి చంద్రశేఖర్ స్పందించారు. తన కొడుకు హిందూ కాదు, క్రిష్టియన్ కాదు.. భారతీయుడు... అని పేరు అలా ఉంటే తప్పా? అంటూ నిలదీశారు. హీరో విజయ్ నటించిన తాజా చిత్రం "మెర్సల్". ఇందులో జీఎస్టీతో పాటు డిజిటల్ ఇండియాపై విమర్శలు గుప్పించారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు హెచ్.రాజా విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఓటర్ ఐడీని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, విజయ్ మతం మార్చుకున్నాడని, అతని పేరు సి.జోసెఫ్ విజయ్ అని ఆరోపించారు. దీనిపై విజయ్ తండ్రి తీవ్రంగా మండిపడ్డారు. 
 
తన కుమారుడిని జోసఫ్‌ విజయ్‌ అని సంబోధిస్తున్నారు... ఆ పేరులో తప్పేముంది? అని ప్రశ్నించారు. తన పేరు చంద్రశేఖర్‌ అని చెప్పిన ఆయన, తనది శివుడి పేరని తెలిపారు. విజయ్‌ క్రిస్టియనో లేక ముస్లిమో అదీ కాక హిందువో కాదని స్పష్టం చేశారు. విజయ్ ఒక మనిషి అని, అంతకుమించి భారతీయుడన్నారు. 
 
అసలు తనను అడిగితే ప్రజలకు సేవచేసేందుకు విజయ్ రాజకీయాల్లోకి రావాలన్నారు. అంటే నటుడిగా కాకుండా నాయకుడిగా మారాలని కోరారు. అపుడే తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయకూర్చగలడన్నాడు. విజయ్ నిర్ణయమే అంతిమమన్న ఆయన, తాను బలవంతం చేయనని అన్నారు.