గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (14:44 IST)

నింగికేగిన సినీతారలు.. శ్రీదేవికి అప్పుడే ప్రాణాపాయం తప్పిందా?

అలనాటి తార అతిలోకసుందరి హఠాన్మరణం అందరినీ కలచివేసింది. వెండితెరపై అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న శ్రీదేవి మరణ వార్త యావత్తు భారతదేశం దిగ్భ్రాంతికి గురైంది. శ్రీదేవి తరహాలోనే వెండితెరపై తమ అందచందాలు,

అలనాటి తార అతిలోకసుందరి హఠాన్మరణం అందరినీ కలచివేసింది. వెండితెరపై అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న శ్రీదేవి మరణ వార్త యావత్తు భారతదేశం దిగ్భ్రాంతికి గురైంది. శ్రీదేవి తరహాలోనే వెండితెరపై తమ అందచందాలు, నటనతో ఆకట్టుకున్న ఎంతోమంది హీరోయిన్లు చిన్న వయస్సులోనే తనువు చాలించారు. 
 
ముందుగా శ్రీదేవికి ఎనిమిదో ఏటనే ప్రాణాపాయం తప్పింది. శోభన్‌బాబు ''నా తమ్ముడు'' సినిమాలో ఒక సీన్‌ను తీస్తున్నారు. శ్రీదేవి పరిగెత్తుకుంటూ రోడ్డు దాటే సీన్‌ చేయాల్సింది. ఆ చిత్ర దర్శకుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తండ్రి కేఎస్‌ ప్రకాశరావు అయినప్పటికీ ఆ సీన్‌ను రాఘవేంద్రరావు డైరెక్ట్‌ చేశారు. అప్పటికి యువకుడైన రాఘవేంద్రరావు.. ఇంగ్లీష్ సినిమాల ప్రభావంతో సీన్ సహజంగా రావాలని.. శ్రీదేవిని మద్రాస్ మౌంట్‌రోడ్‌లో నిజంగానే ట్రాఫిక్‌లో పరిగెత్తమన్నారు. తాను చేతిరుమాలు ఊపగానే పరుగెత్తుకుంటూ రావాలని సూచించారు. 
 
చిన్నపిల్ల కావడంతో అందులో ప్రమాదాన్ని ఆలోచించని శ్రీదేవి.. ఆయన కర్చీఫ్‌ ఊపగానే రోడ్డుకు అడ్డంగా పరిగెత్తేశారు. కన్నుమూసి తెరిచేలోపు.. ఒక కారు ఆమె కాలిని తాకి వెళ్లిపోయింది. శ్రీదేవి కింద పడిపోయింది. అదృష్టవశాత్తూ దెబ్బలు తగల్లేదు. ఆపై రాఘవేంద్రరావుతో అనతి కాలంలోనే 24 సినిమాలు చేసింది. ఇలా భారతీయ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీదేవి శనివారం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇకపోతే.. శ్రీదేవి తరహాలో చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ల సంగతికి వస్తే.. దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌. హిందీతోపాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించిన సౌందర్య కూడా అందం, అభినయంతో తెలుగువారికి దగ్గరైంది. అయితే 32 ఏళ్ల వయస్సులో 2004లో జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో సౌందర్య ప్రాణాలు కోల్పోయారు. 
 
మొగల్‌-ఏ-ఆజం, నీల్‌ కమల్‌ వంటి చిత్రాల పేరు చెబితే మధుబాల గురించి చర్చించకుండా ఉండలేరు. అప్పట్లో వెండితెర రారాణిగా గుర్తింపు పొందింది. మంచి నటిగా రాణిస్తున్న సమయంలోనే 36 ఏళ్ల వయస్సులో గుండె సంబంధ ఇబ్బందులతో కన్నుమూసింది. అలాగే పదహారేళ్లకే సినీ అరంగేట్రం చేసిన ఆర్తీ అగర్వాల్ తెలుగులో చాలా హిట్‌ చిత్రాల్లో నటించింది. బేరియాట్రిక్‌ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లి.. శస్త్రచికిత్స జరుగుతుండగా... గుండె ఆగిపోవడంతో 31ఏళ్ల వయస్సులోనే మృతిచెందింది.
 
బాలీవుడ్‌ మార్లిన్‌ మన్రో ఎవరంటే ఇప్పటికీ పర్వీన్‌ బాబీ పేరు చెబుతారంటే అతిశయోక్తికాదు. అమర్‌ అక్బర్‌ ఆంటోని, దీవార్‌, క్రాంతి, షాన్‌ వంటి సినిమాల్లో పర్వీన్‌ నటనకు వీక్షకులు ఫిదా అయ్యారు. కొన్నాళ్లు మానసిక సమస్యలతో ఇబ్బంది పడిన ఆమె 55 ఏళ్ల వయస్సులో ఆత్మహత్య చేసుకుంది. బాలీవుడ్‌లో ఫిమేల్‌ గురుదత్‌గా పేరు తెచ్చుకున్న మీనాకుమారి తీవ్ర అనారోగ్యంతో 38 ఏళ్ల వయస్సులోనే మృతిచెందింది.
 
ఎవరినైనా శ్రీదేవితో పోల్చితే గొప్ప అదృష్టంగా భావిస్తారు. ఒకానొక దశలో దివంగత దివ్యభారతిని శ్రీదేవితో పోల్చారు. శ్రీదేవితో తనను పోల్చడం థ్రిల్‌ కలిగించిందని ఓ ఇంటర్వ్యూలో దివ్యభారతి చెప్పారు. ఆమె గొప్ప అందగత్తె అని కొనియాడారు. ఈమె టీనేజ్ వయస్సులోనే బాలీవుడ్, టాలీవుడ్‌లను షేక్ చేసింది. అయితే ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌ బాల్కనీ నుంచి కింద పడి చనిపోయింది. అప్పటికి ఆమె వయస్సు 19 ఏళ్లు.