శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (11:20 IST)

అజిత్ సినిమాలో జాన్వీ కపూర్.. శ్రీదేవిని మరిపిస్తుందా?

వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా ఓ యాక్షన్‌ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్‌‌‌కు వెళ్లనుంది. అయితే ఈ  యాక్షన్ సినిమాలో ఓ కీలక పాత్రలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ నటించే అవకాశాలున్నాయని టాక్ వస్తోంది. ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ సౌత్ సినిమా ఇండస్ట్రీని పలకరించనుందని టాక్ వస్తోంది. జాన్వీ తండ్రి బోనీకపూర్‌ నిర్మాతగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. 
 
జాన్వీ తొలి చిత్రం ధడక్ ద్వారా మంచి నటనను అదరగొట్టింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన 'సైరాత్‌'కు ఇది రీమేక్. ప్రస్తుతం జాన్వీ కపూర్ కార్గిల్‌ గాళ్, రుహీ అఫ్జా, తక్త్ సినిమాలతో బాలీవుడ్‌లో సూపర్ బీజీగా గడుపుతోంది.
 
ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ అజిత్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. అజిత్ ప్రస్తుతం నెర్కొండ పార్వాయి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా 'పింక్'  అనే హిందీ సినిమాకు రీమేక్ . ఈ సినిమాను కూడా బోనీ కపూరే నిర్మిస్తున్నారు. ఆగస్టు 10న విడుదల కానున్న ఈ సినిమాకు తర్వాత అజిత్ నటించే చిత్రంలో జాన్వీ నటిస్తుందని తెలుస్తోంది.