గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 21 మే 2019 (15:13 IST)

సాగర కన్యలా ఐశ్వర్యా రాయ్

ఫ్రాన్స్ దేశంలోని రివేరా నదీతీరంలో 72వ కేన్స్ ఫిల్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేదిక అంతర్జాతీయ తారల రాకతో సందడిగా మారింది. ఇప్పటికే భారత్ నుంచి కంగనారనౌత్, ప్రియాంకచోప్రా, దీపికాపదుకునే వంటి అగ్ర హీరోయిన్లు హాజరయ్యారు. 
 
తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ హాజరైంది. ఆమె పారిస్‌కు చెందిన ప్రఖ్యాత సౌందర్య ఉత్పత్తుల సంస్థ లారియల్‌కు ఐశ్వర్య ప్రచారకర్తగా వ్యవహరిసున్న విషయం తెలిసిందే. కేన్స్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా కూడా ఐశ్వర్యరాయ్ పనిచేస్తున్నది.
 
అయితే, ఈ యేడాది ఐష్.. తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరైంది. తన కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన వారందరిని ఆనందపరవశుల్ని చేస్తూ కేన్స్ రెడ్‌కార్పెట్‌పై ఐశ్వర్యరాయ్ నడయాడింది. సాగరకన్యలా ముస్తాబై ఆహుతుల్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. 
 
పసిడి వర్ణంతో తయారుచేసిన కలిడియోస్కోపిక్ క్రోమ్ గౌనులోమ తళుకులీనింది. ఫిఫ్‌కట్‌తో కూడిన ఈ వస్త్రధారణ అందరినీ ఇట్టే ఆకర్షించింది. లెబనీస్ డిజైనర్ జీన్ లూయిస్ సబాజీ రూపొందించిన ఈ ప్రత్యేకగౌను కేన్స్ రెడ్‌కార్పెట్‌పై ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఐశ్వర్యరాయ్ తనయ ఆరాధ్య పసుపురంగు గౌనులో అమ్మతో పాటు రెడ్‌కార్పెట్‌పై నడిచి వచ్చింది.