మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2019 (15:13 IST)

హరికృష్ణ తొలి సంవత్సరీకం .. హాజరైన చంద్రబాబు

సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ తొలి సంవత్సరీకం ఆదివారం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 
 
గత యేడాది ఇదే రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన తొలి వర్థంతి వేడుకలను ఆదివారం హైదరాబాద్‌లో ఆయన తనయులైన హీరోలు నందమూరి హరికృష్ణ, నందమూరి కళ్యాణ్‌ రామ్‌లు నిర్వహించారు.
 
ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. హరికృష్ణ నివాసంలో ఆయనకు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. హరికృష్ణ తనయులతో ఆత్మీయంగా మసలుకున్న చంద్రబాబు వారితో కుటుంబపరమైన విషయాలు చర్చించినట్టు తెలిసింది. అంతకుముందు హరికృష్ణ చిత్రపటం వద్ద ఆయన నివాళులు అర్పించారు.