గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 మే 2022 (16:50 IST)

సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదు : చిరంజీవి

Chiranjeevi
చిత్రపరిశ్రమలోని 24 కళలకు చెందిన కళాకారుల జీవితాలకు ఎలాంటి భరోసా లేదని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మే డే వేడుకల్లో ఆయన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, సినీ కార్మికులు ఎన్నో బాధలు దిగమింగి పని చేస్తారన్నారు. సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కరోనా వేళ కార్మికలకు నిత్యావసరాలు ఇవ్వడం బాధ్యతగా భావించానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు కలిసి ఉండాలని కోరారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాల సహకారం కావాలని ఆయన కోరారు. చిత్ర పరిశ్రమకు తెలుగు రాష్ట్రాల సీఎంవోలు ఎంతో భరోసానిచ్చారని కొనియాడారు.