శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (12:37 IST)

'ఎన్నియల్లో.. ఎన్నియల్లో.. ఎందాకా...' ఆనంద్ గొంతు పాడిన పాటకు నేను నర్తించాను...

ప్రముఖ తెలుగు సినీ నేపథ్య గాయకుడు జి. ఆనంద్ కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కరోనాతో బాధపడుతూ వచ్చిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 
అలాంటివారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆనంద్‌తో తనకున్న అనుబంధాన్ని ఆయన నెమరువేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో తన సంతాపాన్ని తెలిపారు. 
 
‘ఎన్నియల్లో... ఎన్నియల్లో... ఎందాకా… అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్ర దానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి, చిరు దరహాసి జి.ఆనంద్. ఈయన కర్కశమైన కరోనా బారిన పడి ఇక లేరు అని నమ్మలేకపోతున్నాను. 
 
మొట్ట మొదటి సారి వెండి తెరమీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన, అవినాభావ బంధం ఏర్పరిచింది. ఆయన ప్రస్థానం నన్ను వెంటాడే విషాదం. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సంతాపం తెలియచేసుకుంటున్నాను’ అంటూ చిరు ట్వీట్ చేశాడు.