ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (13:05 IST)

రావు గోపాల్ రావు భార్య కన్నుమూత.. రావు రమేష్‌కు చిరు పరామర్శ

సీనియర్ సినీ నటుడు రావు గోపాల్ రావు సతీమణి కమలా కుమారి (73) శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె శనివారం తుదిశ్వ

సీనియర్ సినీ నటుడు రావు గోపాల్ రావు సతీమణి కమలా కుమారి (73) శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. 
 
కమలాకుమారి మరణవార్త తెలిసిన వెంటనే... రావు రమేష్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. రావు రమేష్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రావు రమేష్‌ను ఓదార్చారు. 
 
కమలాకుమారి ప్రముఖ హరికథా కళాకారిణి. ఈమె హరికథా ప్రదర్శనలో దిట్ట. వివిధ రాష్ట్రాల్లో 5వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. రావు గోపాల రావు - కమల కుమారిది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి పెద్ద కుమారుడే సినీ నటుడు రావు రమేష్.