సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (08:34 IST)

"మెగా డిసెంబరు" - సెట్స్‌పై నాలుగు చిత్రాలు.. ఇదికదా "మెగా మేనియా"

లేటు వయస్సులో కూడా మెగాస్టార్ చిరంజీవి దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే కుర్రకారు హీరోలతో పోటీపడుతూ సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. డిసెంబరు నెలలో ఏకంగా ఆయన నాలుగు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. దీంతో మెగా డిసెంబరు అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో చిరు మేనియా సాగుతోందంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిరంజీవి 152వ చిత్రం. ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్‌" అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇది చిరంజీవి 153వ చిత్రం. దీని తర్వాత బాబీ దర్శత్వంలో 154వ చిత్రాన్ని చేయనున్నారు. దీనికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 
 
అలాగే, మెహర్ రమేష్ దర్శకత్వంలో 155వ చిత్రంగా "భోళా శంకర్" అనే చిత్రాలు చేయనున్నారు. ఈ నాలుగు చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ డిసెంబరు నెలలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇది ఆల్‌టైమ్ మెగా రికార్డు అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.