Widgets Magazine

చిరంజీవి బర్త్‌డే గిప్ట్... "సైరా" ఫస్ట్‌లుక్ రిలీజ్...

గురువారం, 7 జూన్ 2018 (12:32 IST)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌, టాలీవుడ్ హీరో జగపతి బాబు, తమిళ హీరో విజయ్ సేతుపతిలు కీలక పాత్రలు పోషిస్తుండగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో వీరిపాత్రలు ఏ విధంగా ఉంటాయోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.
syeraa narasimha reddy
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను అధికారికంగా ఆగస్టు 22వ తేదీన విడుదల చేనున్నారు. ఆ రోజు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆ తేదీని ఖరారు చేశారు. చిత్రానికి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
కాగా, స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి జీవిత నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ 30 శాతం వ‌రకు పూర్తైన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో తాజా షెడ్యూల్ జ‌రుపుకుంటుండ‌గా, 40 రోజుల పాటు మూవీ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఐస్‌క్రీమ్ అరగిస్తే ముక్కులో నుంచి పొగ వస్తుందా... ఈ వీడియో చూడండి..

ఐస్‌క్రీమ్‌ను ఇష్టపడని వారంటూ ఉండరు. చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం వీటిని లొట్టలేసుకుని ...

news

''మహానటి''గా కీర్తి సురేష్ అదుర్స్.. రామ్ చరణ్

''మహానటి'' సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రముఖ ...

news

'మాస్ మసాలా.. పైసా వ‌సూల్‌' రజినీకాంత్ "కాలా".. మూవీ రివ్యూ

రెండేళ్ళ గ్యాప్ తర్వాత తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం "కాలా". 'కబాలి' తర్వాత ...

news

డైరెక్ట‌ర్స్ మీటింగ్ పైన బ‌న్నీ ఏమ‌ని ట్వీట్ చేసాడో తెలుసా..?

టాలీవుడ్‌లో ప్ర‌జెంట్ స‌క్స‌స్‌లో ఉన్న డైరెక్ట‌ర్స్ కొంతమంది ద‌ర్శ‌కులు ఓచోట క‌లిసారు. ...

Widgets Magazine