గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మే 2022 (21:51 IST)

అలాంటివి మానేయండి.. ఎఫ్ 4లో కూడా కామెడీ అదిరిపోద్ది?

Ali
Ali
F3 సినిమా సక్సెస్ మీట్‌ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, హీరో, కమెడియన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ సినిమా హిట్ అయితే ఓ నిర్మాత బావుంటాడు, ఓ నిర్మాత బావుంటే ఓ దర్శకుడు బావుంటాడు, ఆర్టిస్టులు అంతా బావుంటారు, టెక్నీషీయన్లు అంతా బావుంటారు అన్నారు అలీ. 
 
ఓ సినిమా పోతే మరో సినిమా వాళ్లు చంకలు గుద్దుకోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదని అలీ చెప్పారు. దయచేసిన అలాంటివి మానేయండి అంటూ సూచించారు. మానేస్తేనే మంచిది.. మీరు నమ్మకున్న సినిమా.. అవతాలివారు బాగుండాలి అనుకుంటే భగవంతుడు మిమ్మల్ని వాడికంటే బాగా ఉంచుతాడన్నారు. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
 
ఇంకా అలీ మాట్లాడుతూ.. ఎఫ్3లో అనిల్ రావిపూడి తనకు మంచి పాత్ర ఇచ్చారన్నారు. తన చేతికి ఓ గన్ ఇచ్చి ఫుల్ కామెడీ చేయించారన్నారు. ఎక్కడకు వెళ్లినా ఆ గన్ గురించే అంతా అడుగుతున్నారన్నారు. ఎఫ్ 4లో కూడా ఇంతకుమించిన కామెడీ ఉంటుందన్నారు అలీ.