బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (16:13 IST)

సందీప్ కిషన్ తో 'మజిలీ' బ్యూటీ లిప్ లాక్

Sandeep kishan
Sandeep kishan
హీరో సందీప్ కిషన్ తో లిప్ లాక్ లో మునిగిపోయింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేని సందీప్..ప్రస్తుతం 'మైఖేల్' అనే సినిమా చేస్తున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'మజిలీ' బ్యూటీ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. 
 
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ యాక్షన్ రోల్ లో నటిస్తుండగా.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ సంస్థలు ఈ రూపొందిస్తున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ - వరుణ్ సందేశ్ - అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను అక్టోబర్ 20 న విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ ఓ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో దివ్యాంశ కౌశిక్ ని ఓ బైక్ పై కూర్చోబెట్టి.. సందీప్ కిషన్ ఆమెకు గాఢమైన లిప్ లాక్ ఇస్తూ కనిపించాడు. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.