పెళ్లికూతురు కానున్న 'పద్మావతి' : రేపు నిశ్చితార్థం?

గురువారం, 4 జనవరి 2018 (16:28 IST)

deepika - ranveer

బాలీవుడ్ హీరోయిన్ 'పద్మావతి' (దీపికా పదుకొనె) పెళ్లికుమార్తె కానుంది. గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడినే వివాహం చేసుకోనుంది. ఆ ప్రియుడు ఎవరో కాదు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఇందులోభాగంగా, దీపిక పుట్టినరోజైన జనవరి ఐదో తేదీన వీరిద్దరి నిశ్చితార్థం జరుగనుందనీ జాతీయ మీడియాలో కథనాలు విస్తృతంగా ప్రసారమవుతున్నాయ. తన 32వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి వీరిద్దరూ ఇప్పటికే సీక్రెట్‌గా శ్రీలంకకు చేరుకున్నారు. 
 
ఈ వేడుకలోనే వీరిద్దరూ ఉంగరాలను మార్చుకోబోతున్నారని జాతీయ మీడియా చెబుతోంది. నిశ్చితార్థం తర్వాత కొద్ది రోజుల్లోనే వివాహ వేడుకు ఉంటుందని అంటోంది. మరోవైపు, కొత్త సంవత్సరం వేడుకలను దీపిక, రణవీర్‌లు మాల్దీవుల్లోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీల వివాహం ఇటీవల జరిగిన విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలో జరిగిన విషయం తెల్సిందే. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తండ్రిని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించిన హీరో

మెగా సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరు. తన సినీ కెరీర్‌లో ...

news

ప్రవాసాంధ్రులకు "అజ్ఞాతవాసి" సందేశం (వీడియో)

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల 10వ తేదీన ...

news

హీరో నాగార్జునకు షాకిచ్చిన కేంద్రం.. గుర్తింపు రద్దు

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అక్కినేని కుటుంబానికి ...

news

వివాదాల్లో పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'... రంగంలోకి 'బాహుబలి' రానా... ఎందుకు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి చిత్రం సంక్రాంతి పండుగకు ముందే ...