బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (15:52 IST)

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శ్రియా భూపాల్

ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈమె ఉపాసన కొణిదెలకు కోడలు వరుస అవుతారు. ఆమె 2018లో రాజకీయ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారి వివాహ వేడుకను ఆధ్యాత్మిక నాయకుడు జగ్గీ వాసుదేవ్ ఘనంగా నిర్వహించారు.
 
పెళ్లి తర్వాత ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. తాజాగా శ్రియా భూపాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తమ మొదటి మనవడిని స్వాగతిస్తున్నట్లు ఉపాసన కొణిదల ట్వీట్ చేశారు. పైగా, ఈ బాబుకు ఇవాన్ సోమిరెడ్డి అని పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు ఈ పోస్ట్‌పై నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.