గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (14:24 IST)

కన్నడ సూపర్ స్టార్ పునీత్ ఆఖరి చిత్రం "జేమ్స్" టీజర్ రిలీజ్

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం "జేమ్స్". ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఇందులో భావేద్వేగాలు బిజినెస్ కంటే పెద్దవి అనే టైటిల్‌తో మొదలవుతుంది. ఇందులో మాఫియా, మాఫియా డాన్స్ మధ్య జరిగే స్టోరీగా తెలుస్తుంది. 
 
పునీత్ రాజ్‌కుమార్ ఇందులో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. పునీత్ మాఫియాను ఎలా అంతం చేస్తాడన్న కథాంశంతో తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఇందులో సూపర్ యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నాయి. ఫుల్‌ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తుంది. కాగా, ఈ చిత్రాన్ని మార్చి 17వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించగా, శ్రీకాంత్ విలన్‌గా కనిపించనున్నారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు. భారత గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ చిత్రం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే.