మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : సోమవారం, 20 మే 2019 (18:34 IST)

ఒకే రోజున రెండు సినిమాలతో భయపెట్టనున్న తమన్నా??

సాధారణంగా ఒక హీరో.. ఒక హీరోయిన్ కలిసి రెండు భాషల్లో నటించిన సినిమాలు రెండూ కూడా ఒకే రోజున విడుదల కావడం అనేది దాదాపు చాలా అరుదుగా మాత్రమే జరుగుతూంటుంది. అలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా - ప్రభుదేవాల విషయంలోనూ జరుగుతోంది.
 
గతంలో తమన్నా నటించి హిట్ సాధించిన అభినేత్రి సినిమాకు సీక్వెల్‌గా ఆవిడ ప్రభుదేవాతో కలిసి 'దేవి 2' ( అభినేత్రి 2) సినిమా చేసారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయబోతున్నారు. 
 
కాగా... తమన్నా-ప్రభుదేవా కాంబినేషన్‌లో చక్రి తోలేటి దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'ఖామోషి'... కూడా ఈ నెల 31వ తేదీనే విడుదల చేయనున్నారట. ఇలా ఈ హార్రర్ హిట్ పెయిర్ తమన్నా - ప్రభుదేవాలు కలిసి చేసిన రెండు సినిమాలూ ఒకే రోజున  ప్రేక్షకులను పలకరించనుండటం నిజంగా విశేషమేనని చెప్పుకోవాలి.