సుశాంత్ మెమోరీస్ అద్భుతం.. వీడియో షేర్ చేసిన సంజన.. వైరల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ బలవన్మరణానికి పాల్పడి.. నెల దాటింది. అయితే ఆయన జ్ఞాపకాలను మాత్రం జనం మరిచిపోలేకపోతున్నారు. తాజాగా సుశాంత్‌తో చివరి చిత్రం దిల్ బెచారాలో కథానాయికగా నటించిన సంజన సంఘి మెమోరబుల్ వీడియో షేర్ చేసింది. ఇది తెర వెనుక సన్నివేశానికి సంబంధించిన వీడియో కాగా ఇందులో సుశాంత్, సంజన సరదాగా డ్యాన్స్ చేస్తుండడం మనం చూడవచ్చు.
కఠినమైన సన్నివేశాల మధ్యలో కొంత ఊపరి పీల్చుకునేందుకు సుశాంత్ కొంత సేపు డ్యాన్స్ చేద్దాం అని చెప్పేవాడు. ఓ వ్యక్తిని మనం కోల్పోయిన తర్వాతనే వారి విలువ తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.
సుశాంత్ మెమోరీస్ అద్భుతం. ఆయన జ్ఞాపకాలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయంటూ సంజన పేర్కొంది. సుశాంత్‌తో నటించిన స్వస్తిక ముఖర్జీ కూడా ఇటీవల ఆయనతో చేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో షేర్ చేసిన విషయం విదితమే. తాజాగా సంజన షేర్ చేసిన వీడియోను ఓ లుక్కేయండి. దీనిలో ఆమె సుశాంత్‌తో కలిసి నడుస్తున్నట్లు చూడవచ్చు.