గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (11:25 IST)

మరోమారు తండ్రి అయిన నిర్మాత దిల్ రాజు

Dilraju
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాత దిల్ రాజు మరోమారు తండ్రి అయ్యారు. ఈయన తొలి భార్య అనిత గుండెపోటు కారణంగా కన్నుమూశారు. వీరికి హన్షిత అనే ఓ కుమార్తె ఉన్నారు. ఆ తర్వాత ఆయన తేజస్వి అనే మహిళను గత 2020 డిసెంబరు పదో తేదీన రెండో పెళ్లి చేసుకున్నారు. ఇపుడు ఈ దంపతులకు బుధవారం ఉదయం మగబిడ్డ జన్మించాడు. దీంతో దిల్ రాజు ఇంట పండుగ వాతావరణం నెలకొంది. దిల్ రాజు ఇంటికి వారసుడొచ్చాడు అంటూ టాలీవుడ్ ప్రముఖులు మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
ఇదిలావుంటే, దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో విజయ్‌తో వారసుడు అనే పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇపుడు దిల్ రాజు ఇంటికి నిజంగానే మగబిడ్డ రూపంలో వారసుడు రావడం వచ్చాడు. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.